64వ వార్డులో బోరు బాగుచేయించిన జనసేన కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరెడ్డి

గాజువాక, తేదీ 04.1.2022. గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గంగవరం గ్రామం, PAT సెంటర్ వాకాడ నర్సింగ్ రావు, సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాలా రోజుల నుండి మంచినీళ్లు బోరు మూత పడిందని 64వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరెడ్డికి ఫిర్యాదు చేయగా సమస్య చెప్పిన 24 గంటల్లోనే పరిష్కారం అయ్యింది. మహిళలు, కార్పొరేటర్ గోవింద్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. మరియు గంగవరం జనసేన నాయకులకు, ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తానని.. వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు, సత్తి బాబు, సోమేష్ జనసేన పార్టీ, విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంటు అధికార ప్రతినిధి శ్రీ చోడిపిల్లి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.