జనసేవలో జనసేన కౌన్సిలర్ విజయలక్ష్మి

కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘం 9 వ వార్డు జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి వార్డ్ పరిధిలో సంఘ 9 వ వార్డులో రోడ్డు ప్రక్కన చెట్లు పెరిగి తుప్పలు ఏర్పడడంతో వాటివలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వార్డుపరిధిలో సాయంపేట నుండి ఎర్ర వంతెన వరకు రోడ్ ప్రక్కన పెరిగినచెట్లు, తుప్పలు పురపాలక సంఘ జెసిబితో తొలగించే కార్యక్రమం చేపట్టింది. వార్డు కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి, ఆమె భర్త వాసు, దగ్గరుండి తొలగింపు పనులను పర్యవేక్షించారు.