అన్నమయ్య డ్యాం బాధితుల కోసం జనసేన దీక్ష: అతికారి దినేష్

రాజంపేట: అన్నమయ్య ప్రాజెక్టు వరదలు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ వరదల వల్ల దాదాపు 40మంది చనిపోయారు, వేల సంఖ్యలో పశువులు చనిపోయాయి, వందల ఎకారల భూముల్లో ఇప్పటి ఇసుక మేటల్లోనే వున్నాయి, ఇప్పటికీ వరదల వల్ల నివాసం కొల్పోయిన వాళ్ళు టార్పలిన్ కవర్ల మధ్య తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికి వరద గ్రామలకు రోడ్లను నిర్ముంచలేదు. మూడు నెలలో ఇళ్ళు నిర్మిస్తాం అని జగన్ రెడ్డి చెప్పారు వరదలు వచ్చి మూడో సంవత్సరం కావస్తున్న ఇప్పటికీ భాధితులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వలేదు. అన్నమయ్య వరద ప్రాంత ప్రజలకు స్వచ్చంద సేవ సంస్థలు, కుల సంఘలు, అతికారి వెంకటయ్య లాంటి పారిశ్రామిక వేత్తలు, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల జనసేన నాయకులు ఇలా ఎవరికితోచినట్లు వాళ్ళు వరద బాధితులను చూసి చలించి వారి కన్నీళ్ళు తుడిచి వారికి చేతనైన సహాయం చేశారు కాని ఈ వైసీపీ నాయకులకు కాని, సీఎం జగన్ రెడ్డికి కాని వరద భాధితుల బాధలు నేటికి కనిపించడం లేదు. అందుకే ఇప్పటికి వరద భాధితులకు తగిన సహాయం అందక ఇప్పటికి కష్టాలను అనుభవిస్తున్నారు. జనసేన ఆధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వరద బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగపొవడంతో చలించి భాధితులకు అండగా ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ రెడ్డి బాధితులను పట్టించుకోని తీరును ఎండగట్టారు. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచే జనసేన శ్రేణులు అందుకే అన్నమయ్య డ్యామ్ బాధితుల కోసం జనసేన పార్టీ వరద బాధితులు, ప్రజలతో కలిసి అక్టోబర్ 30న జరిగే ఒక్క రోజు రిలే నిరాహార దీక్ష రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయం ముందర చేయనున్నట్లు రాజంపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు అతికారి దినేష్ తెలిపారు. ఈ రిలే నిరహర దీక్షకు జనసైనికులు, జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భాధితులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా ‌అతికారి దినేష్ పిలుపు ఇచ్చారు. పనిలో పనిగా రాజంపేట స్థానిక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి పనితీరుపై అతికారి దినేష్ స్పదించారు. ఈ ఎమ్మెల్యేకి భూకబ్జాలపై వున్న ఆసక్తి వరద భాధితులను ఆదుకొవడంలో లేదన్నారు. ఈ ఎమ్మెల్యేకి ఇసుకను అక్రమంగా తరలిచడం వున్న శ్రద్ధ పచ్చని పంట పోలలపై కప్పేసిన ఇసుక తొలగించడంపై లేదని అన్నారు. ప్రాంతానికి ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకోవడంపై వున్న శ్రద్ద భాధితులకు ఒక నివాసం నిర్మంచి ఇవ్వలేకపోతున్నారు. ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జున రెడ్డి అనర్హులు అంటు పత్రిక ముఖంగా అతికారి దినేష్ తెలియజేశారు. అక్టోబర్ 30న చలో రాయచోటి ఎన్నాళ్ళు-ఎన్నేళ్ళు-ఈ కన్నీళ్ళు అన్నమయ్య భాధిలను ఆదుకొండి సీఎం గారు అంటూ ఈ కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లా నాయకులు అన్నమయ్య వరదను తీవ్రతను తెలియజేసేలా రూపోదించిన పోస్టర్లను జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు మరియు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గార్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, ముఖరం చాన్, జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కీర్తన, వివేక్ బాబు, ఉమ్మడి కడప జిల్లాకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని రాజంపేట జనసేన నాయకులు అతికారి దినేష్ తెలిపారు.