గైనకాలజిస్టును, నైట్ డ్యూటీ డాక్టర్ను నియమించాలని జనసేన డిమాండ్

రాజంపేట, సిద్ధవటం మండల కేంద్రమైన సిద్ధవటం లో ఉన్న 30 పడకల ఆసుపత్రికి గత కొంతకాలంగా గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే గైనకాలజిస్టును నియమించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవాలని జనసేన నాయకులు కొట్టే రాజేష్, పసుపులేటి కళ్యాణ్, ఆవుల రాజాలు శనివారం వైద్యాధికారి మధుశేఖర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అలాగే రాత్రిపూట డాక్టర్లు లేకపోవడంతో అత్యవసర చికిత్స అందక ఇటీవల కాలంలో మరణాలు సంభవించిన సంఘటనలు జరుగుతున్నాయని ఇకనైనా రాత్రిపూట డాక్టర్ విధులు నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన దృష్టికి తీసుకొని పోయారు. నూతనంగా ఏర్పాటు చేసిన 30 పడకల ఆసుపత్రి భవనంలో పేషెంట్లకు మెరుగైన వైద్యం కోసం 30 పడకల ఆసుపత్రికి కావాల్సిన పరికరాలను ఏర్పాటు చెయ్యాలని వారు వైద్యాధికారి దృష్టికి తీసుకొని పోయారు. వీటన్నిటిపై ఆయన సానుకూలంగా స్పందించారు.