నష్టపోయిన పంటకి నష్టపరిహారాన్ని అందించాలని జనసేన డిమాండ్

సర్వేపల్లి నియోజకవర్గంలోని పంట పొలాలను సోమవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా కోతకు వచ్చినటువంటి వరి పంట నీట మునగడం కొంతమంది కోసిగట్టుకు తెచ్చుకున్నది వర్షానికి తడిసిపోవడం జరిగింది. అకాల వర్షం కారణంగా రైతులు ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ఈ పంట నష్టపోయిన రైతులకు కావచ్చు, తడిచిన ధాన్యాన్ని కావచ్చు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. అదేవిధంగా వాళ్లకి నష్టపోయిన పంటకి ఎంతో కొంత నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులకి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఏదైతే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి రైతులని ఆదుకోండి ఎంత పంట నష్టపోయిందో ఆ నష్టపోయిన పంటకి తగిన పరిహారాన్ని అందించండి అంతేగాని కాలయాపన చేయొద్దు రైతులను ఇబ్బంది పెట్టొద్దు రైతే రాష్ట్రానికి దేశానికి వెన్నుముక కాబట్టి వెంటనే త్వరితగతిన వాళ్లకి పరిహారం అందించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, ఖాజా, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు షేక్ రహీం, చిన్న, శ్రీహరి, రహమాన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.