మిడ్ మానేరు ముంపు గ్రామాలను సందర్శించిన జనసేన

ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంకు చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కందుల అనిల్ రెడ్డి అభ్యర్థన మేరకు మిడ్ మానేరు ముంపు గ్రామాలను సందర్శించిన ఉమ్మడి కరీంనగర్ యువజన విభాగం అధ్యక్షులు రావుల మధు జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల శివారెడ్డి, ఉపాధ్యక్షులు తడకపెల్లి అరవింద్, పల్లే మహేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పండుగ గగన్ కుమార్, విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ సవానపెల్లి ప్రేమ్ కుమార్, జనసేన నాయకులు కవంపెల్లి పవన్ కుమార్, నాయకులు సవనపెల్లి ప్రశాంత్ జనసైనికులు పాల్గొన్నారు. అనంతరం జనసేన పార్టీ యువజన అధ్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్ సూచనల మేరకు కొదురుపాక గ్రామ సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే దిశగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉమ్మడి కరీంనగర్ యువజన అధ్యక్షులు రావుల మధు, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ గుండె మీడ్ మానేరు డ్యాం అక్కడి ముంపు గ్రామాల ప్రజలకు ఇస్తామని చెప్పిన 5 లక్షల ప్యాకేజీ, స్థలాల పెండింగ్ డబ్బులు, రైతు కుటుంబాలకు మరియు 18 సంవత్సరాల యువతిలకు 2 లక్షల ప్యాకేజీ డబ్బులు ఇవ్వకపోవడంతో అధిక ఇబ్బందులతో 30కు పైగా బాధితులు అదే మానేరు డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమస్యను వెంటనే పరిశీలించి నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం తరుపున డిమాండ్ చేశారు.