రైతులకు ఎరువులు తక్షణమే అందించాలని జనసేన డిమాండ్

కాకినాడ, జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ మండలం రేపురు గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు ఎరువులు తక్షణమే అందించి రైతులను ఆదుకోవాలని జనసేన ఆధ్వర్యంలో నిరసన తెలపటం జరిగింది. ఈ సందర్బంగా రైతు భరోసా కేంద్రం వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్న కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు నక్క శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముమ్మిడి బుజ్జి, పట్టాభి, దామలంక బురయ్య, ప్రసాద్ తదితరులు.