గిట్టుబాటుధర కల్పించి గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన డిమాండ్

జి.మాడుగుల మండలం మారుమూల బోయితెలి పంచాయితీ మద్దిగరువు గ్రామంలో జరిగిన జనసేన రైతు సభలో ముఖ్య అతిధిగా హాజరైన అరకు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ శ్రీ వంపూరు గంగులయ్య ప్రసంగిస్తూ గిరిజన రైతులు పండిస్తున్న పంటలకు, సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు దరలేక రైతులు అల్లాడిపోతున్నారు గత్యంతరం లేక ఇవాళ చట్ట వ్యతిరేక పంట సాగు చేపడుతున్నారు. ప్రభుత్వాలు G.C.C ని ఆర్థిక పరిపుష్టితం చేసి తద్వారా గిట్టుబాటు ధర కల్పిస్తూ గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. జనసేన ఎప్పటికి రైతు పక్షాన ఉంటుంది, పోరాడుతుంది. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే మారుమూల పల్లెల్లో రవాణా, సదుపాయాలు కొరవడింది రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో జనసేన రాజీ లేని పోరాటం చేస్తుందని అవసరమైతే చలో ITDA ముట్టడి, నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన పాడేరులో బహిరంగ సభ నిర్వహిస్తాం, ప్రతి ఆదివాసీ రైతులను కలుపుకుంటు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పై రైతులకు కార్యోన్ముఖులు చేస్తూ పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలకు భరోసా కలిగిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించే పాలన వ్యవస్థ కోసం ఎప్పటికి ప్రజలకు హెచ్చరిస్తూనే ఉంటారు. ఆ వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని భవిష్యత్ తరాలకు భద్రత, భవిష్యత్ ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ విషయాలపై ప్రజలు తమకు తాముగా చైతన్యవంతులు కావాలని డా. గంగులయ్య చెప్పారు. అమాయక ఆదివాసీ రైతులపై అక్రమ కేసులు పెట్టకూడదని అలా చేస్తే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని. ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇప్పటికైనా వాస్తవ నిజాలు తెలుసుకుని గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని పాలకులు ఎప్పటికి ప్రజా, రైతు క్షేమాన్ని విస్మరించారాదని హితవు పలికారు. జనసేన ఎప్పటికి ప్రజలతోనే ఉంటుంది. ప్రశ్నించడం మా మొదటి బాధ్యతగా స్వీకరిస్తాం..ప్రభుత్వపాలన సక్రమంగా జరిగే వరకు ఆగదు ఈ పోరాటం అంటూ డా. గంగులయ్య జనసేన పార్టీ అరకు ఇన్చార్జి ప్రజలనుద్దేశించి ఆద్యంతం ఆదివాసీలను ఆలోచింపచేసారు. ఈ సభలో ముఖ్య అతిధిగా డాక్టర్.వంపూరు గంగులయ్య, అరకు పార్లమెంట్ ఇన్చార్జి.జి మాడుగుల మండల నాయకులు మసాడి భీమన్న, మండల అధ్యక్షులు, క బి.మురళి, మండల ప్రధాన కార్యదర్శి బి.మురళి, గౌరవ అధ్యక్షులు టి.వి రమణ గౌరవ ఉపాధ్యక్షులు ఎం.పి. గంగరాజు, ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు రమేష్, పవన్ కళ్యాణ్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, ప్రచార కార్యదర్శి వెంకటేష్, సాలేబు అశోక్, అనిల్ కుమార్, రామ్, లక్ష్మణ్, వంతల ఈశ్వరనాయుడు తదితర జనసైనికులు పాల్గొన్నారు.