అన్వర్ ను అంత గోప్యంగా ఎలా రిమాండ్ కు పంపారో సమాధానం చెప్పాలని జనసేన డిమాండ్

• ఈ కుట్రలో రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పాత్ర ఉందా ?
• పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారబట్టే.. ఈ కేసు మొత్తంలో గోప్యత పాటిస్తున్నారా ?
• నాలుగు సెల్ పోన్లు పెట్టుకుంటేనే ప్రెస్ మీట్లు పెట్టే పోలీసు వారు అన్వర్ కేసులో సీక్రెట్లు ఎవరిని కాపాడటం కోసం సమాధానం చెప్పాలి
• వీడియోలు విడుదల చేస్తున్నది ఎవరు ?
• ఈ కేసును డీల్ చేసిన ఇమ్రాన్ కు హైదరాబాద్ నయీంతో సంబంధాలు ఉన్నాయా?

విజయవాడ, పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతిన మహేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అస్లాం హత్య కేసును పోలీసులే తప్పుదోవ పట్టించారని, ఆనాడు అందరూ భార్య, ప్రియుడిపై అనుమానాలు వ్యక్తం చేసినా పోలీసులు ఎందుకు స్పందించలేదని, నేడు వాళ్లే స్వయంగా బయటకు వచ్చి చెబితే గానీ పోలీసులు పట్టుకోలేక పోయారని, ఇప్పటికీ అస్లాం హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని, అన్వర్ విడుదల చేసిన వీడియోలో రెండు భాగాలు మాత్రమే బయటకు వచ్చాయని, అతని వీడియో మొత్తం ఎక్కడ ఉందని, ఎవరు విడుదల చేస్తున్నారని, పోలీసులు ఈ అంశంపై ఎందుకు దృష్టి సారించడం లేదని, అన్వర్, నసీమాలను అరెస్టు చేసిన పోలీసులు సైలెంట్ గా న్యాయమూర్తి ముందు పెట్టారని, రిమాండ్ తర్వాత పోలీసులు మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదని, ఈ విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారంటేనే ఈ కేసులో చాలా మంది పాత్ర ఉందని అర్దం అవుతుందని, ఈ కేసులో కోటి రూపాయల డబ్బులకు మొదటి నుంచి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఈ కోటి రూపాయలు ఎవరెవరి చేతుల్లోకి వెళ్లాయి, ఎన్ని చేతులు మారాయి వివరాలు చెప్పాలని, పోలీసుశాఖలో పదవీ విరమణ చేసిన డీసీపీ బాబూరావు పేరు ఒక్కటే వినిపించిందని, మరి ఇతర పోలీసు అధికారుల పేర్లు బయటకు రాకూడదనే అక్కడితో వీడియో కట్ చేసి పంపారని, అన్వర్ చెబుతున్న ప్రకారం పోలీసులు డబ్బులు, అధికారానికి లొంగిపోయరా? అని అనుమానం ప్రజలందరితోపాటు మాకు కలుగుతుందన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు కూడా తప్పుగా ఇచ్చారంటే.. కేసు తప్పుదోవ పట్టించారనే కదా అని, ఈ కేసుపై పోలీసు కమిషనర్ స్వయంగా స్పందించి తదుపరి చర్యలు తీసుకోవాలని, వన్ టౌన్ పోలీసులపై నమ్మకం లేకే కదా..! టాస్క్ ఫోర్స్ పోలీస్ వారితో విచారణ చేయించారంటే పోలీస్ శాఖలో కొంతమందిపై నమ్మకం లేకనేనా అనే అనుమానం కలుగుతుందని, ఈ కేసులో రాజకీయ నాయకుల పాత్ర ఉందని అందరూ విశ్వసిస్తున్నారని అందుకే అత్యంత గోప్యంగా వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారని, అస్లాం హత్య విషయంలో ఆరోజు మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎందుకు స్పందించలేదని అప్పుడే అడిగాం, 20రోజుల తర్వాత అస్లాం ఇద్దరు భార్యల వద్దకు ఒకేరోజు వెల్లంపల్లి శ్రీనివాస వెళ్లి పరామర్శించారంటే ఇరువురి దగ్గర పంచాయతీ చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం ఇందులో స్పష్టంగా ఉందని, కేసు పక్కదారి పట్టించడానికి ఇలా చేశారని, నేడు హత్యగా నిర్ధారణ అయినా కూడా వెల్లంపల్లి శ్రీనివాస ఎందుకు మాట్లాడటం లేదు, నిందితుడు అన్వర్ తో వెల్లంపల్లి ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయని, ఖమ్మంలో ఉండే ఇమ్రాన్ అనే వ్యక్తి ఈ కేసు మొత్తాన్ని హ్యాండిల్ చేశారని తెలుస్తుందని, హైదరాబాద్ లో నయీంతో ఈ ఇమ్రాన్ కు పరిచయాలు ఉన్నాయని చెబుతున్నారని, విజయవాడ నగర పోలీసులు వీటిపైకూడా విచారణ చేసి వాస్తవాలు వెల్లడించాలని, అస్లాం హత్య కేసుపై న్యాయం చేయాలని మొదటి జనసేన ఉద్యమం చేపట్టిందని, ఆ తర్వాత అన్ని పార్టీల వారు ముందుకు వచ్చి ఆందోళనలు చేశారని, ఎఫ్.ఐ.ఆర్ లో అనుమానాస్పద మృతిగా నమోదు చేస్తే.. హత్య కేసుగా మార్చాలని మేమే డిమాండ్ చేశాం, ఆనాడు పోలీసులు నన్ను పిలిచి హత్య అని ఎలా చెబుతావని విచారణ చేశారు. నన్ను ప్రశ్నలు అడిగిన పోలీసులు అన్వర్ ను అంత గోప్యంగా ఎలా రిమాండ్ కు పంపారో సమాధానం చెప్పాలని, ఈ కుట్రలో రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పాత్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారబట్టే ఈ కేసు మొత్తంలో గోప్యత పాటిస్తున్నారని, నాలుగు సెల్ పోన్లు పట్టుకుంటేనే ప్రెస్ మీట్లు పెట్టే పోలీసులు అన్వర్ కేసులో సీక్రెట్లు ఎవరిని కాపాడటం కోసం సమాధానం చెప్పాలన్నారు. జనసేన చేసిన పోరాటం, ప్రయాణం వల్ల నేడు అస్లాం కేసులో నిజాలు బయటికొచ్చాయని, ఈ కేసు విషయంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వాస్తవాలు బయటకు వెల్లడించి ప్రజలకు అన్ని విషయాలు సంపూర్ణంగా తెలియజేస్తారని నమ్ముతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సయ్యద్ మోబినా, ఏజస్ షైక్ మరియు మీర్జా పాల్గొన్నారు.