మత్స్యకార భృతి ఇవ్వాలని జనసేన డిమాండ్

ఇచ్చాపురం, వేట నిషేధ సమయంలో మత్స్యకార భృతి ఇవ్వాల్సిన ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఏదైతే ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్న సమయంలో ఇస్తున్న భృతి రూ.10000 ప్రభుత్వ పథకాలు ఎవరకైతే వర్తిస్తున్నాయో వాళ్లకు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారు. దీనిపై మత్సకారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే మత్సకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వివిధ రకాల షరతులు పెట్టి ఇలా మోసం చేస్తున్నాయని తెలిసి జనసేన ఇచ్చాపురం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికి కూడా ప్రభుత్వం ఇంతవరకు చిల్లిగవ్వ కూడా సబ్సిడీ మత్సకారులకు న్యాయపరంగా రావాల్సిన భరోసా భృతిని ఇవ్వకుండా అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం కావున దీనిని ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు, మత్సకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహారా, ఇచ్చాపురం మత్సకార నాయకుడు బడే రాజు తీవ్రంగా ఖండించడం జరిగింది.