రాజంపేటను అన్నమయ్య జిల్లాగా చేయాలని జనసేన డిమాండ్

రాజంపేట, గత 5 రోజులుగా దగా పడిన రాజంపేట అన్నమయ్య జిల్లా సాధన కోసం కులాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలు కార్యకర్తలు నిత్యం మండుటెండల్లో పోరాటం చేస్తుంటే ఇంతవరకు ఈ రాజంపేట నియోజకవర్గం ఎంపి గానీ, ఎమ్మెల్యే గానీ అలాగే ప్రతి సంవత్సరం రాజంపేట నుండి అన్నమయ్య కాలినడకన తిరుమలకు పాదయాత్ర చేసే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం రాజంపేటలో ఉంటున్న జెడ్పి చైర్మన్ ప్రజల మధ్యలోకి రాలేదంటే కారణం ఏంటి. మీరే రాజంపేట జిల్లా కాకుండా రాయచోటిని జిల్లా చేయడానికి సహకరించారా, ఎన్నికోట్లకి మా రాజంపేట అన్నమయ్య జిల్లా కాకుండా అమ్ముడు పోయారో నిజం చెప్పండి. ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని మీ వైసిపి పార్టీని నమ్మి గెలిపించుకుంటే మీ రియల్ ఎస్టేట్ దందా కోసం మా బ్రతుకుల్ని నాశనం చేస్తారా. మెడికల్ కాలేజీని ముందుగా ప్రకటించి తర్వాత మదనపల్లికి తరలిస్తుంటే మౌనంగా చోద్యం చూస్తూ కూర్చున్న మీరు రాజంపేట కి 2 కిలోమీటర్ల దూరం తాళ్లపాకలో పుట్టిన అన్నమయ్య పేరును తీసుకెళ్లి రాయచోటికి పెడుతుంటే ఏమీ చేతగాని స్వార్ధ నాయకుల్లా మీరు మిగిలిపోవొచ్చు కానీ జనసేన నాయకులుగా, కార్యకర్తలుగా మేము మాత్రం చూస్తూ ఊరుకోము. అక్రమ సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్న మీకు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి ఖచ్చితంగా రాజంపేట నడిబొడ్డున జనసేన జెండాను రెప రెప లాడించి మీకు ఓటమిని రుచి చూపిస్తామని తెలియచేస్తూ పార్లమెంట్ నియోజకవర్గంను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పిన సీఎం ఈ రోజు మాట తప్పి రాయచోటికి ఏమి సౌకర్యాలు ఉన్నాయని అన్నమయ్య జిల్లాగా ప్రకటించారో మా రాజంపేట ప్రజలకు సమాధానం చెప్పాలని రాజంపేట ప్రజలు మీ నిలకడ లేని నిర్ణయాలను నిలదీస్తున్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు కరుణాకర్ రాజు, రాష్ట్ర జనసేన పార్టీ చేనేత అధ్యక్షులు రామయ్య, కత్తి సుబ్బారాయుడు, ఆకుల నరసయ్య, గురివిగారి వాసు, కోలా రవి శంకరయ్య, లతీఫ్, గంటా రమేష్, గోపి, వెంకటయ్య, మస్తాన్ రాయులు, ఆర్య, మహేష్, శంకరయ్య, తాళ్లపాక రవి, భావికాడ పల్లె, నందలూరు జ్స్ప్ కార్యకర్తలు పాల్గొని రాజంపేటకు దగా చేసిన సీఎం, ఎంపొ, ఎమ్మెల్యే, జెడ్పి చైర్మన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాజంపేటను జిల్లా సాధించుకునే వరకు మా జనసేన పోరాటం ఆగదని రాజంపేట వసిపి నాయకులను ఆకుల నరసయ్య మరోమారు హెచ్చరించారు.