ఇచ్చాపురం మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మున్సిపాలిటీ కమీషనర్ కి తెలియజేస్తూ, జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు వినతిపత్రం సమర్పించారు. మున్సిపాలిటీకి చెందిన 13 షాపులు వేలానికి పెట్టిన విషయాన్ని ప్రజలకు ముందుగా తెలియజేయకపోవడం ద్వారా పారదర్శకత లోపించిందని పేర్కొన్నారు. తద్వారా అవకతవకలపై దర్యాప్తు జరిపించి, మళ్లీ సమర్ధవంతంగా అవకాశం ఇవ్వాలని కోరారు. 22వ వార్డు శాంతినికేతన్ స్కూల్ వద్ద రోడ్లు, డ్రైనేజీ లేని దుస్థితితో పాటు, 15 ఏళ్లుగా ఉన్న పైపుల నుంచి ఇప్పటికీ నీళ్లు రాకపోవడం బాధాకరమని వివరించారు. 20వ వార్డులోని కొండపోలమ్మ కాలనీలో ప్రధాన రహదారి, స్ట్రీట్ లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే 10వ వార్డులో కార్జివీధి నుండి స్వర్ణభారతి స్కూల్ వరకు రోడ్డు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఇంకా, మున్సిపాలిటీ పరిధిలోని చాలా వార్డుల్లో స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడం, వర్షాల కారణంగా కాలువలు మట్టితో నిండిపోవడం వల్ల నిలిచిన నీటి సమస్య తలెత్తుతుందని తెలిపారు. అందుకే సమగ్ర పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, రోకళ్ళ భాస్కర్, కల్యా గౌడో, ప్రేమ్ కుమార్ బిసాయి, రుక్మాందర రావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment