ఎస్.కోట లో జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

శ్రీనగవరపు కోట నియోజకవర్గం: ఎస్.కోట లో జనసేన అధ్వర్యంలో జగనన్న కాలనీ కన్నీళ్లు కార్యక్రమము శనివారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎస్.కోట పున్యగిరి 147 లే అవుట్ సందర్శించడం జరిగింది. జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్తిబాబు, వబ్బిన సన్యాసి నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ కోట జగనన్నకు 70శాతం అనర్హులకు పట్టాలు ఇచ్చారని, అర్హులకు అందలేదని అవకతవకలను ఎంక్వయిరీ చేసి సరిదిద్దాలని, నిజమయిన పేదలకు 5 లక్షలు చొప్పున నిధులు కేటాయిస్తేనే పెరిగిన మెటీరియల్ రెట్లకి ఇల్లుకట్టగలరని లేని పక్షంలో ప్రభుత్వం వారికి కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలనీలో రోడ్లు త్రాగు నీరుకి ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే నిధులు కేటాయించి కాలనీ పేదలకు మవులిక సదుపాయాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో కాలనీ పేదలను కూడగట్టి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో ఎస్.కోట మండల జనసేన అధ్యక్షులు కొత్యడ రామకోటి, చిన్ని, చంటి ఎయిర్టెల్
సతీష్, కిరణ్ జామి, జనసేన నాయకులు డేగల ఈశ్వరావు వర్మ, రాజు, ఎల్ కోట మండల నాయకులు సేక్ పిరోజ్, వేపడ మండల నాయకులు రుద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.