గండేపల్లి గ్రామంలో 39వ రోజు జనంలోకి జనసేన

జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర చేస్తున్నాటువంటి జనంకోసం జనసేన కార్యక్రమం 39వ రోజు గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర గండేపల్లి గ్రామం మొత్తం పర్యటించి ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. 39వ రోజు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ గారికి, గరికపాటి ఉమేష్ కుమార్ గారికి, కర్రి సోమేశ్వరస్వామి గారికి, కట్టుమోతు సత్తిబాబు గారికి, నాళం పెంటారావు గారికి, యడ్ల సతీష్ గారికి, వర్రి రాజు గారికి, బుర్రా వీరబాబు గారికి, మర్రి లోవరాజు గారికి, మర్రి రమణ గారికి, యడ్ల స్వామి గారికి, పేరారపు ప్రసాద్ గారికి, వరుపుల వెంకట రాజు గారికి, కారుకొండ విజయ్ గారికి, నల్లంశెట్టి చిట్టిబాబు గారికి, కోడి గంగాధర్ గారికి శ్రీ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 39వ రోజు గండేపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గరికపాటి ఉమేష్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు, కర్రి సోమేశ్వర్ గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.