SSBN కాలేజీ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన జనసేన

అనంతపురం, SSBN ఎయిడెడ్ కాలేజీ ఫీజులు పెంపును నిరసిస్తూ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా “రిలే నిరాహార దీక్ష” చేస్తున్న విద్యార్థులకు అండగా, SSBN కాలేజీ యజమాన్యం ఆడుతున్న దొంగ నాటకాలను రాజకీయాలకతీతంగా ఎండగట్టిన అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మరియు విద్యార్థి నాయకుల్ని జనసేన కార్యకర్తలని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు శ్రీ లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి , ఈశ్వరయ్య, చరణ్ తేజ, M.V. శ్రీనివాసులు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు విద్యార్థి నాయకులు SSBN కాలేజీ విద్యార్థులకు సంఘీభావం తెలియజేసారు.