కౌలురైతు కుటుంబానికి ఆర్ధికసాయమందించిన జనసేన

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో గత ఐదు రోజుల క్రిందట పంట దిగుబడి లేక అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు “జీనేపల్లి జ్వాలా నరసింహారావు” భార్య, పిల్లలను పరామర్శించిన ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ 15000/- రూపాయలు జనసేనపార్టీ తరుపున తక్షణ సాయం అందించారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శిస్తూ వారి వారి కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున అందజేస్తూ వారి పిల్లల భవిష్యత్తుకు పార్టీ నుండి నిధి ఏర్పాటు చేస్తూ ఆదుకుంటున్న జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ రాబోయే ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా నందిగామ నియోజకవర్గంలో కూడా ఈ కుటుంబాన్ని కూడా ఆదుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాబోయే జనసేన పార్టీ ప్రభుత్వంలో కౌలు రైతులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్టామని పేర్కొన్నారు. ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు నరసింహారావు కుటుంబం వైపు కన్నెత్తి చూడకపోవడం దారుణం. ఇదే నియోజకవర్గంలో గత కొన్ని రోజుల క్రితం ఒక ఉన్నత సామాజిక వర్గానికి చెందిన కౌలు రైతు చనిపోతే మరునాడే పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే ఒక బిసి కులానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఐదు రోజులైనా పరామర్శించలేదని, ప్రజలందరినీ సమదృష్టితో చూడాలని, అగ్ర వర్ణ రైతులను ఒక లాగా వెనుకబడిన తరగతులకు చెందిన రైతులను మరొకలాగా దయచేసి చూడవద్దు అని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా కౌలు రైతులకు నష్ట పరిహారం అందేలా స్థానిక ఎమ్మెల్యే చూడాలని, ఆయన ఎందుకు స్పందించలేదో తెలియలేదని, దీనిపై వెంటనే స్పందించి కౌలు రైతు కుటుంబానికి న్యాయం చేయాలని బండ్రెడ్డి రామకృష్ణ డిమాండ్ చేశారు. తుర్లపాడు గ్రామంలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్ర్య చేసుకున్న మరొక రైతు మాలగాని జాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు బొలియాశెట్టి శ్రీకాంత్ రూ 5000/- ఆర్ధిక సాయం అందజేత వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొలియాశెట్టి శ్రీకాంత్, నియోజకవర్గ నాయకుడు పూజారి రాజేష్, కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు నాయిని సతీష్, నందిగామ మండల* అధ్యక్షులు కుడుపుగంటి రామారావు, చందర్ల పాడు మండల అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్, వీరులపాడు మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి జయరాజు, నందిగామ పట్టణ పార్టీ అధ్యక్షుడు తాటి శివ కృష్ణ, షేక్ పెద్ద బాజీ, కనపర్తి సాయి, తేజ, సూరా సత్యం, నందిగామ 20వ వార్డు కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ, పొన్నవరం వార్డు మెంబరు పసుపులేటి శ్రీనివాసరావు లు, జిల్లా కార్యవర్గ సభ్యులు పుట్టా స్వరూప, తోట ఓంకార్, నియోజకవర్గ వీరమహిళా విభాగం నాయకురాలు తోటకూర పద్మావతి, గోపిశెట్టి నాగలక్ష్మి, చనమాల సౌందర్య, పలువురు నాయకులు కార్యకర్తలు 200 వందలమంది పాల్గొన్నారు.