విద్యుత్ సర్క్యూట్ వల్ల ఆహుతి అయిన ఇంటికోసం జనసేన ఆర్ధిక సహాయం

మచిలీపట్నం, 36 డివిజన్ లోని కరెంట్ కాలనీ వద్ద నివాసం ఉంటున్న అల్లం సూరిబాబు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతి అయ్యింది ఈ విషయం తెలుసుకున్న స్థానిక మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ(ఆర్.కె) వెంటనే స్పందించి మచిలీపట్నం జనసేన నాయకులు, వీరమహిళలు మరియు వివిధ డివిజన్ల ఇన్చార్జిలతో వెళ్లి వారికి మనోధైర్యం చెప్పి జనసేన పార్టీ తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.

అనంతరం ఇంచార్జ్ బండి రామకృష్ణ(ఆర్.కె) మాట్లాడుతూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే అల్లం సూరిబాబు కు ఎనలేని కష్టం వచ్చింది అల్లం సూరిబాబుని మరియు వారి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అలాగే స్థానికులు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

జిల్లా ఉపాధ్యక్షులు వంపుగడవల చౌదరి మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రామకృష్ణ మరోసారి తన దాతృత్వని చాటుకున్నారని అన్నారు. మచిలీపట్నం నియోజవర్గంలో ఏ పేదవాడికి ఏ కష్టమొచ్చినా అండగా నిలబడుతుంది కేవలం జనసేన పార్టీ అని ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని రానున్న రోజుల్లో జనసేన పార్టీకి బ్రహ్మరథం పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా సంయుక్త కార్యదర్శి దుర్గాభవాని మాట్లాడుతూ భగవంతుడు ఈ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు జనసేన పార్టీ ఎప్పుడూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం టౌన్ ఉపాధ్యక్షులు సమీర్ వివిధ డివిజన్ల ఇన్చార్జులు మణిబాబు, చంటి, పినిశెట్టి వేణు, తరుణ్, కర్రి మహేష్, ఎండి భాషి, కరుణాకర్, శివ, పృథ్వీరాజు, స్వామి, లంకె శ్రీనివాసరావు, మోకా చిరంజీవి, హేమ శ్రీ, బుజ్జి, వాసు, కొండా మేస్త్రి సత్తి బాబు, సుదర్శన్, నరహరశెట్టి రామ్, పవన్ కుమార్, పిన్నిశెట్టి కుమారి, గణేష్, రమేష్, శివ శంకర్, ఫణి, వడ్డీ చిరంజీవి, వాసు, రామినాయుడు, చక్రి, తోట రాజేష్, తోట భాస్కర్ రావు, తోట యశ్వంత్, పవన్, వీరమహిళలు ఉషా, వాణి, రంగమణి, పట్టణ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.