కంటి చూపు కోల్పోయిన గట్టి సుబ్బారావుకి జనసేన రూపాయలు 53,700/- ఆర్థిక సహాయం

తాడేపల్లిగూడెం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్పూర్తితో తెలంగాణ వీర మహిళా వైస్ చైర్ పర్సన్ మరియు టీం సైనిక గ్రూప్ అడ్మిన్ శ్రీమతి రత్నా పిల్లా, గట్టి శ్రీను మరియు దండగర్ర గ్రామ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో దండగర్ర గ్రామం సెరిబ్రల్ టిబి వ్యాధితో కంటి చూపు కోల్పోయిన గట్టి సుబ్బారావుకి చికిత్స నిమిత్తం జనసేన పార్టీ తరుపున ఋస్ 53,700/- ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి రత్నా పిల్లా, గట్టి శ్రీనుతో బాటు జన సైనికులు మద్ది సోంబాబు, బందిల కృష్ణారావు , గట్టి శ్రీను, గిద్దా దుర్గారావు, మద్ది సోములు, మద్ది సాయి సుధీర్, గోకా నాగార్జున, యడ్లపల్లి నాగుబాబు, మద్ది సాయి సుమంత్ మరియు సురపరెడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయంలో ముఖ్యంగా దేశ రక్షణతో బాటు సమాజ సేవకు కూడా మేము సైతం అంటూ దండగర్ర గ్రామ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ముందుకు వచ్చి రూపాయలు 30,000/- లను, గట్టి శ్రీను, శ్రీమతి రత్నా పిల్లా ఆధ్వర్యంలో రూపాయలు 23,700/- లను మొత్తం ఋస్ 53,700/- సంయుక్తంగా కలిసి అందజేసారు. దీనికి టీం సైనిక (మారిశెట్టి అజయ్ బాబు యువసేన), దండగర్ర జేఎస్పి టీం, ఆరుగొలను జేఎస్పి టీం, జనసైనికులు మరియు వీర మహిళలు తమ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో జేఎస్పి గ్లోబల్ టీం సభ్యురాలు కూడా అయిన శ్రీమతి రత్నా పిల్లాని, ఆమెతో బాటు పాల్గొన్న సభ్యులు అందరికీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, మారిశెట్టి అజయ్ బాబు, టీం సైనిక నుండి అమీర్ ఖాన్, జేఎస్పి గ్లోబల్ టీం నుండి సురేష్ వరికూటి, పాపోలు అప్పారావు మరియు సాయి కృష్ణ తేజ అభినందించారు.