చేనేత కళాకారుడి కుటుంబానికి జనసేన ఆర్ధిక సాయం

పెడన పట్టణం 17వ వార్డులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన చేనేత కళాకారుడు కాశం పద్మనాభం – నాగ లీలావతి, దంపతులు మరియు వారి కుమారుడు రాజా నాగేంద్రం కుటుంబాన్ని జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మెన్ చిల్లపల్లి శ్రీనివాస్ మరియు పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శించారు. తక్షణ సహాయం కింద రామ్ సుధీర్ 25,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మెన్ చిల్లపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా మృతుల కుటుంబానికి అందచేశారు. మరియు మచిలీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి బండి రామకృష్ణ(ఆర్.కె) 10,000/- రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.