వీర్ల వెంకయ్య కుటుంబానికి జనసేన ఆర్థిక సాయం

పిడుగురాళ్ల మండలం, కోనంకి గ్రామానికి చెందిన, జనసేన కార్యకర్త తమ్మిశెట్టి వీర్ల వెంకయ్య అకాల మరణం చెందటం వలన, పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ద్రోణాదుల అంకారావు చేతుల మీదుగా..10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది, అనంతరం కోనంకి గ్రామ జనసైనికులతో.. గ్రామ కమిటీ గురించి చర్చించడం జరిగింది, ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, గురజాల నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ మునగా వెంకట్, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, వర్కింగ్ కమిటీ సభ్యులు వేల్పూరి చైతన్య, కోనంకి గ్రామ జనసైనికులు, బలుసుపాటి శ్రీనివాసరావు, (దాసు) రామాయణం రాము, రవి మరియు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.