కదిరిదేవరపల్లిలో జనసేన జెండా ఆవిష్కరణ

*క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ వేడుక

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం, కదిరిదేవరపల్లిలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మరియు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం మండల ఉపాధ్యక్షుడు వెంకటేష్ శ్రావణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన కళ్యాణదుర్గం పిఓసి అనంతపురం జిల్లా జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్ హాజరయ్యారు. ఆయనతో పాటు కంబదూరు మండల అధ్యక్షుడు చంద్రమౌళి, ఇతర మండలాల కమిటీ సభ్యులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామస్తుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.

Share this content:

Post Comment