సింగరాయకొండలో జనం కోసం జనసేన

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండలో సొమవారం సింగరాయకొండ పంచాయతీ సెక్రెటరీని కలిసి సింగరాయకొండలో పలు సమస్యలపై చర్చించడం జరిగినది. పంచాయతీ సెక్రటరీ తో మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ మాట్లాడుతూ.. సింగరాయకొండలో పలు సమస్యలపై పంచాయతీ ఆఫీస్ లో పాత సెక్రటరీకి అర్జీలు అందజేయడం జరిగినది. సింగరాయకొండలో బుజ్జుల ఎల్లమందరెడ్డి కాలనీలో నీటి సమస్య, కటింగ్ రోడ్డు నుంచి కందుకూరు వెళ్లే రోడ్డు లో స్ట్రీట్ లైట్లు గురించి, పెద్ద కనుమల్ల పోవు నేషనల్ హైవే దగ్గర మురుగు నీటి నిల్వ గురించి మరియు అదే ప్రదేశంలో రోడ్డు పక్కన లైట్లు వెలగకపోవడం గురించి, అలాగే ట్రంక్ రోడ్లో సిమెంట్ రోడ్డు కి ఆనుకొని మోకాళ్ళ లోతు గుంటలు ఏర్పడి నవి.. గతంలో పంచాయతీ వాళ్లు తాత్కాలిక మరమ్మతులు చేశారు కానీ మరలా అవి గుంటలు ఏర్పడుతున్నవి అని సింగరాయకొండ పంచాయతీ సెక్రెటరీ తో జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ పలు సమస్యల గురించి వివరించడం జరిగినది. గతంలో వీటన్నిటి గురించి పంచాయతీ ఆఫీసులో అర్జీలు ఇవ్వడం జరిగినది. కావున స్పందించి ఈ సమస్యలు పై పరిష్కారం చూపుతారని కోరడం జరిగింది సింగరాయకొండ పంచాయతీ సెక్రెటరీ శరత్ చంద్ర సానుకూలంగా స్పందించి ఈ సమస్యలపై పరిష్కారం కచ్చితంగా చూపుతానని నా వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, మండల నాయకులు కాసుల శ్రీనివాస్, అనుముల శెట్టి కిరణ్ బాబు, పోలిశెట్టి విజయకుమార్, షేక్ మా భాష, షేక్ మహబూబ్ బాషా, పొనుగోటి అశోక్ కుమార్, సయ్యద్ వహీద్, సిహెచ్ ప్రవీణ్ కుమార్, పసుమర్తి నాగేశ్వరావు, నామ వెంకటేష్, పూసల కొండయ్య, షేక్ సుభాని, తగరం రాజు, షేక్ సుల్తాన్ భాషా, చలంచర్ల కరుణ్ కుమార్, సిమోను, శ్రీను మరియు జనసైనికులు పాల్గొన్నారు.