పారిశుధ్య కార్మికులకు అండగా జనసేన

రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామపంచాయతీ వ్యవస్థ తీరు అద్వానంగా తయారయింది. పొట్ట కూటి కోసం రోజు కూలిగా పనిచేసే పారిశుధ్య కార్మికులు జీతాలు 6 నెలలు నుంచి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. తినడానికి తిండి లేక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల క్రితం రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు వచ్చి 2 రోజుల్లో మీకు జీతాలు ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చి మరిచిపోయారు. శుక్రవారం నాడు మీకు జీతాలు రాకపోతే నా ఆఫీస్ దగ్గర కానీ, రాష్ట్రంలో నా షాపులు ఎక్కడున్నా అక్కడకు వచ్చి ధర్నాలు చెయ్యండి అని చెప్పి వెళ్లిపోయారు. మాట ఇచ్చి మడమ తిప్పడం అంటే ఇదే. ఈ కారణంగా జనసేన పార్టీ జిల్లా ఇంచార్జ్ కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు వాళ్ళకి సంఘీభావంగా ధవళేశ్వరం జనసేన పార్టీ జనసేన నాయకులు వాళ్ళకు అండగా నిలబడటం జరిగింది. అనంతరం పంచాయతీ వారు దిగి వచ్చి ఒకొక్క కార్మికుడి 20000 చొప్పున ఇచ్చి మిగతా డబ్బులు ఈ నెల 27-05-2022 నాడు ఇవ్వడానికి ఒప్పుకుని ధవళేశ్వరం పంచాయతీ ఇంచార్జ్ నియామకపత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకు సపోర్ట్ ఇచ్చిన జనసైనికులకు పారిశుద్ధ్య కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.