జనం కోసం జనసేన

ప్రకాశం జిల్లా: కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం లోని మూలగుంటపాడు గ్రామపంచాయతీ పరిధిలోని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, జనం కోసం జనసేన కార్యక్రమంలో పాల్గొని, మూలగుంటపాడులో అయిదవ లైన్, ఆరవ లైన్, ఏడవ లైన్ ఎనిమిదవ లైన్ లో ప్రజల సమస్య ల పై పర్యటించగా విస్తుపోయే నిజాలు ప్రజలు వ్యక్త పరుస్తున్నారు. విషయం ఏమనగా ప్రభుత్వ లు మారుతున్నా మా తలరాతలు మారటం లేదు అని, మూలగుంటపాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముందు సర్పంచ్ అయిన డాక్టర్ శివరామి రెడ్డి నన్ను గెలిపించండి వెంటనే మన ప్రాంత ప్రజలకు డ్రైనేజీ మంచినీటి సరఫరా మొదలగు మౌలిక వసతులు అన్ని కూడా నేను ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చి.. సుమారు పదిహేను నెలలు అయినప్పటికీ కూడా కనీసం నాలుగు ఇటుక రాళ్ళు, గంప సిమెంట్ తో కూడా డ్రైనేజీ మరమ్మతులు కూడా చేయలేదని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. నూతన డ్రైనేజీ నిర్మాణం లేక, సిమెంట్ రోడ్డు లేక, జలజీవన్ స్రవంతి పథకం క్రింద పైప్ లైన్ లు లాగినప్పటికీ కూడా, ఏ ఒక్క ఇంటికి రామతీర్థం నుండి వచ్చే మంచి నీటిని ప్రజలకీ అదించటంలో అధికారులు విఫలం అయ్యారు అని ఆ ప్రాంత ప్రజలు తెలియజేయటం జరిగింది. సైడ్ కాలువలు లేనందువలన ఆ ప్రాంతంలో ఇళ్ల నుండి వచ్చే మురికినీరు పక్క ఫ్లాట్ లోకీ పోయి చెరువుని తలపించే విధముగా ఉన్నవి, నిత్యం వీటిలో పందులు, కుక్కలు పొర్లాడుతున్నందు వలన మురుగు నీటి దుర్గంధం వెద జల్లుతుందనీ ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీని వలన అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయనీ, కనీసం బ్లించిగ్ చల్లే నాదుడు కరువు అయ్యారని ప్రజలు వారి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మూలగుంటపాడు లోని సెయింట్ జోన్స్ స్కూల్ నుండి రేగుల గుంట పోవు మురికి నీటి కాలువ తిలక్ రోడ్ నందు కనీసం సుమారు ముప్పై అడుగుల పొడవు కాలువలో పూర్తిగా చెత్త నిండి ఉండడం గమనించిన ప్రజలు పంచాయితీ సిబ్బందికీ తెలియపరచినప్పటికి కూడా పట్టించు కోవపోవటం వలన ఆ కాలవ నుండి దుర్గంధం వెదజలుతున్నది. ఇప్పటికైనా ములగుంటపాడు గ్రామంలోని ప్రజల సమస్యలపై మూలగుంటపాడు గ్రామ సర్పంచ్ డాక్టర్ శివరామి రెడ్డి గారు మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీమతి శారద వెంటనే పరిష్కారం చూపి మూలగుంటపాడు గ్రామ పంచాయతీని ఉత్తమ పంచాయతీ దిశలో ఉంచుతారో, ఉత్తిత్తి పంచాయతీగా మారుస్తారో వేచిచూడాల్సిందే అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, వీరమహిళలు పోలిశెట్టి మాధురి, ఐనా బత్తిన రాధి,క మండల నాయకులు కాసుల శ్రీనివాస్, అనుమల శెట్టి కిరణ్ బాబు, శీలం సాయి, సంకె నాగరాజు, అశోక్, నామ వెంకటేష్, షేక్ సుల్తాన్ బాషా, చలంచర్ల కరుణ్ కుమార్, నరేంద్ర, అభయ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.