కార్వేటి నగరంలో జనం కోసం జనసేన

  • జనసేన సూపర్ సిక్స్ అద్భుతం
  • తెలుగుదేశం సూపర్ సిక్స్ అమోఘం
  • జెఎస్పి, టిడిపిలను ఆదరించండి
  • గాజు గ్లాస్ గుర్తుకు ఓటెయ్యండి
  • నారాయణస్వామి ఓడించడం మా ప్రధాన లక్ష్యం
  • జనసేన ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్రవంతి రెడ్డి

గంగాధర నెల్లూరు: కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం పంచాయతీ, బీసీ కాలనీలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సూపర్ సిక్స్, తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ లోని పేదరిక నిర్మూలన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. పవన్ కళ్యాణ్ స్వార్థం లేని వ్యక్తి, స్వలాబాపేక్ష లేని మహా మనిషి ఈ రాష్ట్ర ప్రజల కోసం అద్భుతమైన పథకాలను రూపొందించారు. ఈ పథకాలన్నీ కూడా ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే పథకాలని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం అమోఘమైన పథకాలకు రూపకల్పన చేశారు. ఈ రెండు పార్టీల సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు రాష్ట్రాన్ని సస్యశ్యామలం దిశగా తీసుకెళ్తాయని తెలియజేశారు. అందుకే నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి గతంలో ఎవరూ చేయలేని అభివృద్ధి, ప్రస్తుతం నారాయణ స్వామి విస్మరించిన అభివృద్ధి, సర్వరంగ సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకులు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ ప్రజలందరూ బలపరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని ఓడించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటి నగర్ మండల కాపు యువసేన అధ్యక్షులు వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు సూర్య నర్సింహులు, టౌన్ కమిటీ సీనియర్ నాయకులు రూప్ శేఖర్ రెడ్డి, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి మనోహర్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల బూత్ కమిటీ కన్వీనర్ సురేష్ రెడ్డి, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, నియోజకవర్గ యువజన కార్యదర్శి అన్నమలై, జనసైనికులు పాల్గొన్నారు.