పచ్చికాపల్లంలో జనం కోసం జనసేన

  • డిగ్రీ కాలేజ్ నిర్మాణం పూర్తయిందా?
  • ఐటిఐ భవన్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది?
  • ఫైర్ స్టేషన్ నిర్మాణంలో ఫైర్ లేదా?
  • ఉపముఖ్యమంత్రిది సవతి తల్లి ప్రేమ:
  • జనసేన ఇంచార్జి సతీమణి స్రవంతి రెడ్డి

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం: వెదురుకుప్పం మండలం, పచ్చికాపల్లం గ్రామపంచాయతీ, పచ్చికాపల్లంలో శనివారం జనం కోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. పచ్చికాపల్లంలో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ వెదురుకుప్పం మండలంలో డిగ్రీ కాలేజ్ నిర్మాణం పూర్తయిందా? ఐటిఐ భవన్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఫైర్ స్టేషన్ నిర్మాణంలో ఫైర్ లేదా? అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి, ఉపముఖ్యమంత్రిది ముమ్మాటికి సవతి తల్లి ప్రేమే అని ఎద్దేవా చేశారు. ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలకు గురి అవుతున్న కార్వేటి నగరం నుండి పచ్చికాపల్లం, వెదురు కుప్పం, దేవళంపేట మీదుగా కొత్తపల్లి మెట్టవరకు రోడ్డును ఇంతవరకు విస్తరించలేదని, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, ఈ రోడ్డుని యుద్ధ ప్రాతిపదికను విస్తరించాలని నాలుగు రోజులు పాదయాత్ర చేశామని, ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. 2024లో జరిగే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అభివృద్ధి సంక్షేమం అంటే ఎలా ఉంటుందో చూపిస్తుందని, జనరించక పాలన తీసుకొస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆలోచన, చంద్రబాబు అనుభవంతో ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవడం ఖాయమని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, యువజన అధ్యక్షులు సతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్ర రెడ్డి, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, పెనుమూరు యువజన అధ్యక్షులు గురు ప్రసాద్, శేఖర్, మండల నాయకులు ముని బెనర్జీ, జన సైనికులు పాల్గొన్నారు.