*ప్రతి జనసైనికుడి ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలి
*జనసేన నేత గురాన అయ్యలు
విజయనగరం: మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జనసేన నేత గురాన అయ్యలు పిలుపునిచ్చారు. మంగళవారం గురాన అయ్యలు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనసైనికులకు పార్టీ జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి జనసైనికుడి ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. తన కార్యాలయంలో పార్టీ జెండాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విజయనగరం నియోజకవర్గం నుంచి 6 బస్సులు, 50 కార్ల ద్వారా జనసైనికులు, వీర మహిళలు ఆవిర్భావ సభకు బయలుదేరుతారని వివరించారు. పార్టీ లో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేస్తూ, విజయనగరంలో జరిగిన సన్నాహక సమావేశానికి సమాచారం లేకపోవడం, అదే రోజు కాకినాడలో లాజిస్టిక్స్ కమిటీ సమావేశం ఉండటంతో హాజరుకాలేకపోయానని వివరణ ఇచ్చారు. తనకు ఏ ఇతర గ్రూపులతో సంబంధం లేదని, తనది కేవలం పవన్ కళ్యాణ్ గ్రూప్ మాత్రమేనని తెలిపారు. అధినేత మరియు పార్టీ పెద్దల సూచనల మేరకు జనసేనను బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని గురాన అయ్యలు పేర్కొన్నారు.

Share this content:
Post Comment