జనసేన ఆవిర్భావ దినోత్సవం సూపర్ సక్సెస్

  • భవిష్యత్ తరాల కోసం పవన్ పక్కా ప్రణాళిక
  • ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి డిప్యూటీ సీఎంతోనే
  • ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో జిల్లా జనసేన పటిష్టం
  • కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నా భూతో నా భవిష్యత్ తన రీతిలో.. సూపర్ సక్సెస్ అయిందని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున్ యాదవ్ అన్నారు. ఆవిర్భావ దినోత్సవం విజయవంతం ఆయన సందర్భంగా ఆదివారం నెల్లూరు గోమతి నగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిస్వార్థ నాయకుడని, అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. భారతదేశంలో ఏ పార్టీ సాధించని విజయం జనసేన పార్టీ సాధించిందని తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం పవన్ కళ్యాణ్ పక్క ప్లాన్ సిద్ధం చేశారని అన్నారు.

  • నెల్లూరుతో పవన్ కు ప్రత్యేక అనుబంధం
    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నెల్లూరు తో ప్రత్యేక అనుబంధం ఉందని నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు. అందుకే నెల్లూరు అభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వివరించారు. జనసేన పార్టీ సభ్యత నమోదులో కూడా నెల్లూరు జిల్లా రికార్డు సృష్టించిందని చెప్పారు. జిల్లాలోని నాయకులు కార్యకర్తలను ఎంతగానో ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్,లాయర్ శ్రీరామ్, గుడి హరి రెడ్డి,కృష్ణా రెడ్డి, మార్కెట్ సురేష్, కాకు మురళి, సుధా మాధవ్, గుర్రం కిషోర్, వర్షచలం రాజేష్,సనత్, సుల్తాన్ బాషా, పి.శ్రీకాంత్, జి.శ్రీకాంత్, మనోజ్, సురేష్, సునీల్, ప్రసాద్ యాదవ్, వెంకట రమణ, శాంతి కల, నందిని మరియు జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment