బర్మింగ్‌హామ్ లో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

యూకే జనసేన బర్మింగ్‌హామ్ బృందానికి 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో చూపిన అసాధారణ కృషికి హృదయపూర్వక అభినందనలు. జనసేన పార్టీ అద్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, మన చుట్టూ ఉన్న జనసైనికులు మరియు వీర మహిళలకు ప్రేరణనిచ్చే, మద్దతు అందించే, మరియు వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయాణం కొనసాగిద్దాం. ఇది కేవలం అభిమానమే కాదు, భవిష్యత్ తరాల కోసం ఒక ఉద్యమం. జనసేన పార్టీలో భాగమవడం మనకు గర్వకారణం అని జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో భాగంగా బర్మింగ్‌హామ్ జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్గనైజర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమ్‌ రాజ్ గెల్లీ, అచ్యుత రాజు కుర్మాపు, కోటేశ్ కంకిపాటి, శివ మామిళ్ల, శ్రీధర్ భూపతి, సందీప్ కొప్పుల, సునిత వేళగ, సిద్దునాథ్ ఓగేటి, రాజీవ్ గుప్తా, సుమంత్ షెట్టి, అఖిల్ సాయి గిర్జాల, రాకేష్ గార్రె, సింధుజా షెట్టి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-17-at-4.32.30-AM-1024x682 బర్మింగ్‌హామ్ లో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

Share this content:

Post Comment