మార్చి 14 న పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారి తనయులు జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ఛలో పిఠాపురం పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్తు అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహిస్తున్నారని, ఆ సభకు బొలిశెట్టి శ్రీనివాస్ క్రౌడ్ మేనేజ్మెంట్ గా నియమించినందుకు గర్వంగా ఉందని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను పండుగ వాతావరణంలో గర్వంగా సక్సెస్ చేయాలని కోరారు. ఈ చారిత్రాత్మక ఎన్నికల విజయం తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుక కాబట్టి ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భారీ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారని, అంతేకాకుండా నియోజకవర్గ నుంచి వేలాదిగా కార్లు, బస్సులతో తరలి వెళ్తున్నవాళ్లకి ఎటువంటి ఆటంకం లేకుండా భోజన సదుపాయం మరియు మంచినీళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశి, పుల్లా బాబి, అడపా ప్రసాద్, మైలవరపు రాజేంద్రప్రసాద్, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్, కేసిరెడ్డి మధులత, కన్నయ్య, అడ్డగర్ల సూరి, గట్టు గోపికృష్ణ, కొనకళ్ళ హరినాథ్, గుండుమొగుల సురేష్, స్నేహ రామకృష్ణ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, బైనపాలెపు ముఖేష్, లక్ష్మణ్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment