మార్కాపురంలో ఇంటింటికి జనసేన

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆదేశాల మేరకు ఇంటింటికి జనసేన కార్యక్రమంలో మార్కాపురం పట్టణం నందు దుర్గమ్మ వీధి, తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామం, మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామ పంచాయితీ, పొదిలి పట్టణం నందు పర్యటించి జనసేన మరియు టీడీపి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, అలాగే రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ కార్యచరణ గురించి ప్రజలకు తెలిపిన మార్కాపురం నియోజకవర్గ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జిల్లా లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ శైలజ, శిరిగిరి మోహన్, శిరిగిరి చలపతి, బొందిలి అనిల్ సింగ్, శివకోటి సింగ్, పగడాల ఆది నారాయణ, వన్నెబోయిన బ్రహ్మం, శిరిగిరి ఆది, షఫి, కె.భూషణం, జె.రాకేష్, పెద్ద బాబు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.