వీఆర్ఏల ధర్నాకు జనసేన సంపూర్ణ మద్దతు

10వ రోజు కొనసాగుతున్న వీఆర్ఏల ధర్నాకు సంపూర్ణ మద్దతుగా జనసేన ఆధ్వర్యంలో సుండుపల్లి మండల తహశీల్దార్ శ్రీమతి శ్రీలత వినతిపత్రాన్ని ఇస్తూ… 7 న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ, సుండుపల్లి తహసీల్దార్ ఆఫీస్ వద్ద వీఆర్ఏలు ధర్నా 10వ రోజు కొనసాగుతుండగా జనసేనపార్టీ తరపున సంఘీభావం తెలిపిన జనసేనపార్టీ నాయకులు. ఈ సందర్బంగా జనసేన నాయకులు రామశ్రీనివాసులు మాట్లాడుతూ విఆర్ఎ లకు 21000 రూపాయలు వేతన ఇవ్వాలని ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన డిఎ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించాలని, డిఎ తో కూడిన వేతనం ఇవ్వాలని నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఎలుగా నియమించి ఆ కుటుంబాలకు న్యాయం చెయ్యాలన్నారు. అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని విఆర్ఎలకు వర్తింపచెయ్యాలన్నారు. గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ధర్నా ఉద్యమించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో వీరమహిళ రెడ్డి రాణి, జనసేనపార్టీ నాయకులు రామశ్రీనివాసులు, ఓబులేసు, చెన్నకృష్ణ, శ్రీరాములు మండల వి.ఆర్.ఏ లు అల్లబకాశ్, నాగరాజ రమణ, శంకరయ్య, లలితమ్మ, జగన్నాథం, అల్లావుద్దీన్, అన్వర్, శివ జయరామయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.