జనసేన ఫండ్ డ్రైవ్

రాజానగరం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా “ఆరెంజ్” సినిమాను మార్చి 25, 26న రీరిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సినిమా ద్వారా వచ్చే మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వడానికి నిర్మాత, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు నిర్ణయించారు. కావున మెగా అభిమానులు, జనసైనికులు “ఆరెంజ్” సినిమాను తిలకించి జనసేన పార్టీ బలోపేతానికి ఉడతా భక్తిగా భాగస్వాములు అవుతారని కోరుకుంటూ… ఈ కార్యక్రమంలో భాగంగా మన రాజానగరం నియోజకవర్గం నుండి కూడా ఈ చిత్ర ప్రదర్శన ద్వారా పార్టీ ఫండ్ కలెక్ట్ చేయాలనే తలంపుతో మన ప్రియతమ నాయకులు బత్తుల బలరామకృష్ణ నేతృత్వంలో రాజానగరంలో ఉన్న “రాయుడు” థియేటర్లో & సీతానగరం మండలం సీతానగరంలో ఉన్న “గీతా బాలాజీ” థియేటర్లలో రెండు రోజులపాటు అనగా 25, 26 తేదీల్లో రెండు థియేటర్లలో మధ్యాహ్నం “మ్యాట్నీషో” లు “ఆరెంజ్” చిత్రం ప్రదర్శింపబడును. ఈ చిత్రాన్ని జనసైనికులు, మెగాభిమానులు అందరూ వీక్షించి తద్వారా వచ్చే ఫండ్ ని జనసేన పార్టీకి పంపించడం ద్వారా పార్టీ నిర్మాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నామని తెలిపారు.