సంగినేనిపల్లిలో జనసేన భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ సమావేశం

తెలంగాణ, కొల్లాపూర్: వీపనగండ్ల మండలం, సంగినేనిపల్లి గ్రామంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వచించడం జరిగింది. ఈ సమావేశంలో అతి త్వరలో నియమించబోయే జనసేన పార్టీ మండల కమిటీ గురించి మరియు మండలంలో పార్టీ బలోపేతం గురించి పార్టీ భవిష్యత్తు కార్యచరణ గురించి అలాగే వీపునగండ్ల మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలలో సమావేశాల గురించి మరియు సంగినేని పల్లి గ్రామంలో జనసేన పార్టీని రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో గాని మరియు అతి త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తీసుకోబోయే కార్యచరణ గురించి చర్చించి వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఆ దిశగా ముందు వెళ్లాలని వారికి సూచించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని జనసేన పార్టీ సిద్ధాంతాలని సంగినేని పల్లి గ్రామంలో అలాగే వీపనగండ్ల మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ఇంటింటికి తీసుకెళ్లే విధంగా ప్రజలకు చెరువు చేసే విధంగా ముందుకెళ్లాలని వాళ్లకు జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ శ్రీ బైరపోగు సాంబశివుడు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండల నాయకులు బత్తిని బాలు, వీపనగండ్ల మండల నాయకులు బాలకృష్ణ, మీసాల విశాల్, సంగినేనిపల్లి గ్రామ నాయకులు దేవరాజ్, ప్రవీణ్, ఆనంద్ తదితరులు పాల్గొనడం జరిగింది.