పాతపట్నం, గత కొద్ది రోజుల క్రితం పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి మండలం, గొట్టిపల్లి పంచాయతీ, గొట్టిపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు అగదల సోమేశ్ అనే గిరిజన యువకుడు ప్రమాదవశాత్తు ఆక్సిడెంటుకి గురవడం వలన అతని కుడి చేయి విరిగిపోయింది. అది తెలుసుకున్న జిల్లా నాయకులు ముందుకు వచ్చి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు పాతపట్నం నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కోరికాన భవాని మండల జనసేన టీమ్ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గం సహకారంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత నగదు (16000/-) ఆర్ధిక సహకారం మరియు నిత్యావసర సరుకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ చేతుల మీదగా అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శలు సవర రామూర్తి, సలాసన షణ్ముఖ రావు, మెలియాపుట్టి మండల నాయకులు సలానా చంటి, లక్ష్మిపురం కిరణ్, మణి, రవి, కళ్యాణ్ మరియు గొట్టిపల్లి జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment