జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ మండలానికి చెందిన వైస్సార్సీపీ 6 ఎంపీటీసీలు శుక్రవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలకు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వానికి, కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వారి అనుచరులతో జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు. వాసంశెట్టి సత్యవతి ఎంపీటీసీ గంగనపల్లి, కేత సూర్య చంద్ర ఎంపీటీసీ, గుత్తుల శ్రీను ఎంపీటీసీ సర్పవరం, మామిడాల నాగ చక్రం ఎంపీటీసీ రేపూరు, బందెలి విరీష తిమ్మాపురం (ఎంపీటీసీ) వైస్ ఎంపీపీ, గుత్తుల సత్తిబాబు ఎంపీటీసీ నేమం చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎంపీటీసీలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment