కావలిలో జనంలోకి జనసేన

  • కావలి నియోజకవర్గంలో ప్రతి గడపకు జనసేన సిద్ధాంతాలు
  • కావలి రూరల్ మండలంలో సిరిపురంలో ప్రారంభించిన జనసేన నాయకులు సిద్దు
  • పవనన్న రావాలి పాలన మారాలి
  • వచ్చే ఎన్నికల్లో జనసేనకి అవకాశం ఇవ్వాలి

కావలి నియోజకవర్గంలో ప్రతి గడపకు జనసేన సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలను తీసుకెళ్లాలానే ఆలోచనతో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని కావలి రూరల్ మండలంలో సిరిపురం గ్రామంలో ప్రతి గడపకు జనసేన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు సిద్దు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి దూరంగా అంధకారంలో ఉందని అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగి పోయాయాని యువతకు ఉపాధి లేదని తెలిపారు. కావలి నియోజకవర్గంలో ఒక్క పంచాయతీలో నిధులు లేవని, కేంద్రం ద్వారా వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి లాగేసుకుంటున్నారని ఏ పంచాయతీలో అభివృద్ధి లేదని, సీసీ రోడ్లు, వీధి దీపాలు లేక ప్రజల ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ అధ్యక్షులు తిరుపతి స్వామి, తోట శేషయ్య, సిరిపురం జనసేన నాయకులు మనోజ్, కిషోర్, తోట సాయి, మల్లి, రావినూతల చిన్నా, చంటి, వాహిద్, విజయ్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.