ధైర్యానికి కేరాఫ్ జనసేన.. దొంగల ముఠాకి కేరాఫ్ వైసిపి: గాదె

గుంటూరు, శుక్రవారం లాడ్జి సెంటర్లో ఉన్న జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పార్టీలో విదూషకుడిగా మారిపోయి అంబటి రాంబాబు నీతి వాక్యాలు చెబుతున్నాడు అని అన్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, నిన్న అంబటి రాంబాబు మంత్రి నాదెండ్ల మనోహర్ గురించి మాట్లాడటం చూస్తే మతి ఉండే మాట్లాడుతున్నారా అని అనుమానం కలుగుతోంది అని విమర్శించారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, జగన్ ఎవరరెరో వ్రాసిన పేపర్లు చదువుతూ ఏదో నోరుజారీ మాట్లాడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై అంబటి రాంబాబు ఏదో మహా నీతిమంతుడులాగా మాట్లాడటం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. వైసిపి నాయకులకు అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఉందని, వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని అలాంటి వ్యక్తులు బడ్జెట్ గురించి మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడాలి కానీ బయట మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ జీతభత్యాలు మాత్రం వైసిపి ఎమ్మెల్యేలు కావాలని ప్రజల గురించి మాట్లాడానికి మాత్రం మరి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద లేదా కనీస వారు గెలిచిన నియోజకవర్గాలు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మాట్లాడే ప్రయత్నం కూడా కనీసం చేయట్లేదని, ముందు వెళ్లి మాట్లాడితే కదా సమయం ఎంత ఇస్తారు అని తెలిసేది. అంతేగాని వెళ్ళకుండా మీడియా ముందు కూర్చొని నంగనాచి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. నిన్న అంబటి జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మీద అవాకులు చవాకులు పేలడం చూస్తే ఎంత బుద్ధిహీనులో అర్ధం అవుతుంది. వారి మాటలు విని అంబటి రాంబాబుని రాష్ట్ర ప్రజలు బఫూన్ లగా చూస్తున్నారు అని అన్నారు. అసలు నాదెండ్ల మనోహర్ ని అనే స్థాయి అంబటి రాంబాబుకి ఉందో లేదో ఆలోచించుకొని మాట్లాడాలని అన్నారు. కనీసం ఆయన పక్కన నిలబడడానికి కూడా పనికిరాని అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చి దీర్ఘాలు తీస్తూ డైలాగులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గతంలో రాంబాబు గారు మంత్రిగా చేసిన అరాచకాలు మీరు వెలగబెట్టిన బాగోతాలు అందరికీ తెలుసని, పేద పిల్లలు ప్రాణాలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కుటుంబానికి సిఎంఆర్ఎఫ్ కింద వచ్చిన చెక్కులలో కూడా సగం డబ్బులు డిమాండ్ చేసిన నీతిలేని నాయకుడని, దొంగ లాటరీ టికెట్లు అమ్ముకున్న బ్రతుకు నీది అని అంబటిపై విరుచుకుపడ్డారు. అలాగే అక్రమ మైనింగ్ విషయంలో అప్పటి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నువ్వు గీత గీసుకొని కొట్టుకున్న సంగతి మరచిపోయావా అని ప్రశ్నించారు. అలాగే రేషన్ బియ్యం అక్రమంగా అమ్ముకున్న మీ వాళ్ళను పట్టుకుంటే అది మసి పూసి మారేడుకాయ చేయటానికి మీ మీడియాలో మాట్లాడటం చూస్తే ప్రజలు కండ్రిఒచి మీ మొహం మీద ఉమ్మేస్తున్నారు అని అన్నారు. గతంలో రేషన్ బియ్యం విషయంలో మీరు చేసిన దోపిడీని బయటపెట్టి రేషన్ బియ్యాన్ని సక్రమంగా ప్రజలకు అందించే విధంగా మనోహర్ చర్యలు చేపడుతుంటే, అవి చూసి మీరు తట్టుకోలేక మీ ఛానల్ మీ పేపర్ ముందుకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసిపి పాలనలో స్కిములు అన్ని స్కాములు తప్ప ఏమైనా ఉన్నాయా, ఉంటే చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. అలాగే జన సైనికులు చేస్తున్న విమర్శలపై రాంబాబు వెటకారంగా మాట్లాడుతున్నారని, తమకు అంతకంటే వెటకారంగా మాట్లాడటం వచ్చని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలతో నడుపుతున్న పార్టీ అని ఏ రోజు కూడా తాము వైసిపి వాళ్లలాగా పనికట్టుకొని విమర్శించమని, ఎప్పుడైతే వైసీపీ వాళ్లు తమని విమర్శిస్తారో అప్పుడు మాత్రమే జనసేన పార్టీ స్పందించిందని అన్నారు. ఆ స్పందన చూసి తట్టుకోలేక సమాధానం చెప్పలేక రాంబాబు గారు మాట్లాడుతున్నారని అన్నారు. అలాగే అసలు ముందు ఈ ఐదేళ్లలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ఏటకారపు మాటలు దొర్లుతున్నాయి జాగ్రత్తగా మాట్లాడండి అంబటి అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ జర్మనీ అని అంటే ఎందుకు వూరికే గింజుకుంటున్నారు అని, పవన్ కళ్యాణ్ అన్న విషయం కాకుండా జర్మనీలో మరేదైనా దాగుందా అని, అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా బయటికి తీస్తామని అన్నారు. వైసీపీ పార్టీ అసలు రాజకీయ పార్టీ కానే కాదు దొంగల ముఠా పార్టీ అది అని విరుచుకుపడ్డారు. ధైర్యానికి కేరాఫ్ పార్టీ జనసేన… దొంగలకు కేరాఫ్ పార్టీ వైసీపీ పార్టీ అని అన్నారు. అంబటి రాంబాబు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడటం మానుకోక పోతే ఇక చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలందరూ కూడా వీరి మాటలు గమనించాలని, వీరు చెప్పే అసత్యాలు నమ్మవద్దని భవిష్యత్తులో జనసేన పార్టీకి అండగా నిలబడాలని అన్నారు. అలాగే జనసేన నాయకులు చందు సాంబశివరావు మాట్లాడుతూ జర్మనీ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాట తీసుకోవాల్సిన పద్ధతిలో వైసిపి నాయకులు తీసుకోవట్లేదని, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చెప్పినట్టు జర్మనీ అనగానే మరేదో ఉందని, అందుకే వైసిపి వాళ్ళు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. రాంబాబులాంటి విద్యావేత్త ఇలాంటి మాటలు మాట్లాడడం సభ్యత కాదని అన్నారు. ఇలా వెటకారంగా మాట్లాడటం వల్లనే గత ఎన్నికల్లో ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారని, అయినప్పటికీ ఇప్పటికీ తమ పద్ధతి మార్చుకోకుండా అలానే మాట్లాడ్డం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. వైసీపీకి ఇప్పుడు 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కనీసం ఆ 11 సీట్లు కాపాడుకునే ప్రయత్నం అయినా వైసీపీ నాయకులు చేయాలని హితువు పలికారు. నీతికి నిజాయితీకి నిలువుటద్దమైన పవన్ కళ్యాణ్ ముందు అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేకనే జగన్ అసెంబ్లీకి వెళ్లట్లేదని అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని, ప్రజలంతా పార్టీకి అండగా నిలబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, సీనియర్ నాయకులు చందు సాంబశివరావు, చట్టాల త్రినాథ్, నక్కల వంశీ కృష్ణ, 47వ డివిజన్ కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment