ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం నందలూరు గ్రామంలో వైరా ఏటి సమీపంలో సెంటినీ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు అక్రమంగా నీటి పైపులైన్లు వేస్తున్న తరుణంలో గ్రామంలోని రైతులు అడ్డుకున్నారు. ఈ నీటి పైపులు లైను వేయడం ద్వారా ఏటిగట్టున ఉన్న ప్రాంతాలకు సాగు నీరు త్రాగునీరు సమస్యలు వచ్చే అవకాశం ఉందని, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఈ నీరు మాత్రమే ఆధారమని తెలియజేసి వాపోయారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆమె స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులను పరిశీలించి పూర్తి వివరములు రైతులను అడిగి తెలుసుకుని ఈ సమస్యను నందిగామ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్యకి మరియు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి తగిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తానని అన్నారు. జనసేన పార్టీ రైతుల పక్షాన అండగా నిలబడే పార్టీ అని అన్నారు. భూమి కవులు చేసుకునే రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలకు అండగా నిలబడి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకొని, రైతుల కష్టం తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని రమాదేవి అన్నారు. నేడు జలజీవన్ మిషన్ ద్వారా ఎన్నో గ్రామాలకు సురక్షితమైన త్రాగునీరు అందిస్తోంది ఎన్డిఏ కూటమి ప్రభుత్వం. భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండేలా నందిగామ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్యకి మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్య పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందలూరు గ్రామం జనసేన నాయకులు కాంతారావు మరియు జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment