*బాధితురాలికి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శ
రాజమండ్రి వన్ ఈ.ఎన్.టి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజానగరం గ్రామానికి చెందిన సత్యవతి అనారోగ్య విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ “నా సేన కోసం నా వంతు” కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందాలన్న డాక్టర్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని తక్షణం సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ డి ఏ కూటమికి చెందిన నాయకులు, ఇతరులు పాల్గొని మానవతా స్పూర్తిని చాటారు.
Share this content:
Post Comment