వంగ లక్ష్మణ్ గౌడ్ నాయకత్వంలో రోజు రోజుకు బలపడుతున్న జనసేన

• లింగసానిపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ
• రానున్న ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా నిలబడబోతుంది.
• ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళల్లో స్థానిక ఎమ్మెల్యే కనీసం 30 రోజులు నివసించగలరా…?
• ప్రజాదరణతో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మార్పు తధ్యం

  • వంగ లక్ష్మణ్ గౌడ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు.

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, బిజినపల్లి మండలం, లింగసానిపల్లి గ్రామ నాయకులు ఆంజనేయులు, లక్ష్మణ్ మరియు గ్రామంలోని జనసైనికుల ఆధ్వర్యంలో ఆదివారం జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగ లక్ష్మణ్ గౌడ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గం, ఎం.డి మహబూబ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జోగులాంబ గద్వాల్ నియోజకవర్గం, బైరపోగు సాంబశివుడు ఉమ్మడి మహబూ నగర్ జిల్లా నాయకులు, కొల్లాపూర్ నియోజకవర్గం, గోపాస్ కుర్మన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం, ఏమ్ రెడ్డి రాకేష్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, వనపర్తి నియోజకవర్గం, హారి నాయక్ జనసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు హాజరై గ్రామంలో బస్ స్టాప్ సమీపంలో డా.బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం జనసేన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ…
• నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు లింగసానిపల్లి గ్రామం నుంచి మొదలవుతుంది.
• ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు అందటం లేదు.
• సొమ్ము ఒకరిది – సోకు ఒకరిది అన్నట్టుగా ఈ పాలన. అధికార పార్టీ నాయకులు ప్రజల సొమ్ముతో వారి పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా తెలంగాణ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు.
• రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.
• ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబల్ బెడ్ రూమ్ ఎలా ఉన్నాయి అంటే
గతంలో మేము డబల్ బెడ్ రూములు సందర్శించినప్పుడు ఒక చిన్న కర్రతో గోడపై గీకితే ఇసుక సిమెంట్ వచ్చేది. స్థానిక ఎమ్మెల్యే కనీసం 30 రోజులైనా కుటుంబంతో సహా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళల్లో నివసించగలరా….?
• అధికార పార్టీ నాయకులు చేస్తున్న భుదందాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు జనసేన పార్టీ ప్రశ్నిస్తూ ఉంది.
• ఈరోజు లింగసానిపల్లి గ్రామం నుంచి మొదలైన జనసేన జెండా ఆవిష్కరణ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో జెండా ఎగరేస్తాం.
• పల్లె పల్లె ఎగరాలి పవనన్న కార్యక్రమం ద్వారా పల్లె పల్లెకు జనసేన జెండా ఎగరేస్తూ, పార్టీని ప్రజల్లోకి మరింత చేరువగా ముందుకు తీసుకెళ్తామని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు, జనసైనికులందరు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎం.డి మహబూబ్ మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో జనసేన పార్టీకి దక్కుతున్న ఆదరణను చూస్తుంటే చాలా సంతోషంగా ప్రజల తరపున ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించడానికి జనసైనికులు వంగ లక్ష్మణ్ గౌడ్ అడుగులో అడుగేసుకుంటూ పార్టీని మరింత బలపరచాలని కోరుకుంటున్నాను అన్నారు.
బైరపోగు సాంబ శివుడు మాట్లాడుతూ… నాగర్ కర్నూల్ జిల్లాలో మొట్ట మొదటిగా లింగసానిపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, జనసైనికులు, గ్రామ నాయకులు మరింత ఉత్సాహంగా పార్టీ బలోపేతం కోసం ప్రజల తరపున పోరాటాలు చేయాలని అన్నారు.
గోపాస్ కుర్మన్న మాట్లాడుతూ… జనసేన పార్టీ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశయాలను బలపరుస్తూ, పార్టీ సిద్ధాంతాలను నెరవేరుస్తూ, వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ గౌడ్ ని అసెంబ్లీకి పంపించే విధంగా జనసైనికులు అందరూ సంసిద్ధంగా ఉండాలని అన్నారు. ఏమ్ రెడ్డి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ… రాజకీయాల్లో యువతను ముందుకు తీసుకురావాలి, సామాన్యులను రాజకీయంగా బలపరచాలనేది పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమనీ, ఈరోజు లింగసానిపల్లి గ్రామంలో జరిగిన ఈ జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి లక్ష్మణ్ గౌడ్ ఎమ్మేల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని అన్నారు. గోపాస్ రమేష్ మాట్లాడుతూ… పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం ద్వారా ఇంతటి మార్పు మొదలవుతుందని అనుకోలేదని, ప్రతి పల్లెకు జెండాను ఆవిష్కరించుకుంటు, ముందుకు వెళదామని, మేము కూడా కార్వంగా గ్రామంలో త్వరలో జెండా ఎగరేసి వచ్చే ఎన్నికల్లో లక్ష్మణ్ గౌడ్ ని అసెంబ్లీకి పంపించే విధంగా అందరం కలిసి కట్టుగా పోరాడదాం అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ రమేష్, వంగ విజయ్ భాస్కర్ గౌడ్, కొడిగంటి సాయి కుమార్, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, దేవేందర్, శివయ్య, రామన్న, మహేష్, వెంకటేష్ నాయక్, శివాజీ, విష్ణు, భాస్కర్, మహేష్, మల్లేష్, జీలందర్, శివ, విష్ణు, అశోక్, బలకృష్ణ, ఈశ్వర్, ఎడ్ల రాకేష్, సంతోష్, సందీప్, పూస శివ, లాలూ ప్రసాద్, మంగ శివ, అరవింద్, సురేష్, శివ మరియు జనసైనికులు పాల్గొన్నారు.