అగ్ని ప్రమాద బాధితులకు అండగా జనసేన

సత్యవేడు నియోజకవర్గం, కె.వి.బి పురం మండలం, అంజూరు గిరిజన కాలనీ లో గత రెండురోజుల క్రితం విద్యుత్ షాక్ తో 3 పూరిగుడిసెలు కాలిపోవడం జరిగింది. ఆదివారం బాధితులను కలసి నిత్యావసరాలు మరియు ఆర్థికసాయం చేయడం జరిగింది. అనంతరం కాలిపోయిన ప్రదేశాలకి వెళ్లి పరిశీలించి తొందరలోనే ప్రభుత్వ సాయం అందేలా అధికారులును కలసి మాట్లాడుతాం అని వారికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్, మండల అధ్యక్షుడు థామస్, ఉపాధ్యక్షుడు మోహన్, బాషా, చైతన్య, కిషోర్, రుద్ర, హేమాద్రి, వంశి, సందీప్, హరీష్, చెంగయ్య, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.