ప్రజలకు భరోసాగా నిలిచేది జనసేన

  • ప్రజల ఉన్నతి కోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్
  • వైసీపీ పాలనలో దోపిడీ, దౌర్జన్యం, బీభత్సం, అవినీతి తప్ప మరేం లేదు
  • జనసేన ఇంచార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్రవంతి రెడ్డి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలం, కేపీ అగ్రహారం గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం (భవిష్యత్తు గ్యారెంటీ) జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తు గ్యారెంటీలోని అంశాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఉన్నతి కోసం తపించి వారి కోసం పని చేసే నాయకుడు జనసేన అధ్యకులు పవన్ కళ్యాణ్, సగటు మనిషి కోసం ఆలోచించి భరోసాగా నిలిచే పార్టీ జనసేన అని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో బతుకులేదని, బతకలేమని 24 లక్షల మంది వలస వెళ్లిపోయారనీ, ఇది కచ్చితంగా ప్రభుత్వ పాలన వైఫల్యమే అన్నారు. ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు వలసలు వెళ్లినవారిలో అత్యధికులు బడుగు జీవులు, కష్టాన్ని నమ్ముకున్న రైతులే అనేది వాస్తవమని గ్రహించాలి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మౌలిక వసతులు, సౌకర్యాలు కోరుకుంటున్నారు. కడుపు నింపే ఉపాధి, వైద్యం, విద్య అడుగు తున్నారు అంటే వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు కనీస సౌకర్యాలు, వసతులు కూడా అందలేదని అర్ధమవుతోందని తెలిపారు. 10 సంవత్సరాల క్రితం రాష్ట్రం విడిపోయినపుడు మేధావులు, నిపుణులు ఆంధ్రప్రదేశ్ కు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. 972 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీరంతో పాటు సారవంతమైన నేల కలగలిపిన రాష్ట్రం కావడంతో అభివృద్ధి చెందడం చాలా సులభమని చెప్పారు. అయితే వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, పాలన లోపాల వల్ల రాష్ట్రం అన్ని విధాలా వెనక్కు వెళ్లిపోయింది. పరిశ్రమలు రాక, ఉపాధి లేక యువశక్తి నిర్వీర్యం అయిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన రాజధానిని కూడా వెనక్కునెట్టారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగి రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయింది. కరవు, తుపాన్ల ధాటితో రాష్ట్రం విలవిల్లాడింది. అన్ని రంగాలను నాశనం చేసి ఇథియోపియా దేశం తరహాలో వైసీపీ రాష్ట్రాన్ని తయారు చేసింది. రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్యం, బీభత్సం, అవినీతి తప్ప మరేం లేదు. పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని, 2024లో ఖచ్చితంగా జనరల్జక పాలన తీసుకొస్తారని తెలియజేశారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తయారుచేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఇదివరలో నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని అభివృద్ధి పనులు కులాలకతీతంగా, మతాలకతీతంగా, ప్రాంత బేదాభిప్రాయం లేకుండా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, కార్వేటి నగరఒ మండల ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శులు రాఘవ, నరేష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ కేతేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి లోకేష్, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి, కార్వేటినగరం టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు మనోహర్, కార్వేటినగరం మండల కార్యదర్శి రుద్ర, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, వెదురు కుప్పం మండల కార్యదర్శి బెనర్జీ, కార్వేటి నగర్ మండల కార్యదర్శి నాదముని, కొట్టార్వేడు గ్రామపంచాయతీ అధ్యక్షులు వినోద్, నియోజకవర్గ యువజన కార్యదర్శి అన్నామలై, కార్వేటినగరం టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు బాల వరదయ్య, శ్రీనివాసులు, గోపాల్, జనసైనికులు పాల్గొన్నారు.