స్త్రీ మూర్తి కి అత్యంత భద్రత, గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ జనసేన

మదనపల్లి, స్త్రీ మూర్తి కి అత్యంత భద్రత, గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ జనసేన. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలంటే వారికి కూడా రాజకీయ ప్రవేశం కల్పించాలి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ మహిళలకు అండగా వుండాలనే ఆలోచించి ఝాన్సీ లక్ష్మీ బాయి పేరున వీర మహిళలకు అండగా మహిళా విభాగం ఏర్పాటు చేశారు. ఏ పార్టీకి లేనంత మంది జనసేనలో మహిళలు ఎక్కువగా ఉంటు సమాజానికీ తమ వంతు సాయం చేస్తున్నారు. చాలా మంది పార్టీలో చేరుతున్న క్రమంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఆధ్వర్యంలో మదనపల్లి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సతీమణి ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన శ్రీమతి కన్యాకుమారి జనసేన పార్టీలో చేరుతూ జనసేన క్రియాశీల సభ్యతం నమోదు చేసుకున్నారు. వారికి దారం అనిత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపు లేటి హరిప్రసాద్ తరపున సాదరంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మదనపల్లి సీనియర్ నాయకులు తులసి శ్రీనివాస్, దారం హరి పాల్గొన్నారు.