జనసేనతోనే ప్రజా చైతన్యం

  • జనసేనకు పెరుగుతున్న ప్రజాదరణ
  • 72వ రోజుకు చేరిన
  • పవనన్న ప్రజా బాట
  • డాక్టర్ కందులకు
  • బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

విశాఖ దక్షిణ నియోజకవర్గం: జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యస్పందన వస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కందుల నాగరాజు వివిధ ప్రాంతాలలో చేపడుతున్న పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. శుక్రవారం నాటికి ఈ కార్యక్రమం 72వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు నియోజకవర్గంలోని 35వ వార్డులో పర్యటించారు. వెళ్లిన ప్రతిచోట ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో భాగంగా కల్లు పాకల ప్రాంతంలో పుష్పవతి అయిన ఇద్దరమ్మాయిలు ద్రాక్షాయిని, వాణిలకు పట్టు బట్టలు, వెండి పట్టీలు అందజేశారు. అలాగే ఇటీవల మృతి చెందిన దేవుడమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రజలకు నిస్వార్థ సేవలు అందజేస్తున్న డాక్టర్ కందుల నాగరాజు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి వారికి తన పరిధి మేరకు సహాయం అందజేస్తూ అందరి మనసులలో ఒక కుటుంబ సభ్యుడిగా గుర్తింపును పొందారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయడమే తనకు తెలుసని చెప్పారు. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా తాను చేయాలనుకున్న మంచి పనులను చేస్తూనే ఉంటానని వెల్లడించారు. ప్రజలకు మేలు చేసే విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో తన సేవలను మరింతగా విస్తరించనునట్లు వెల్లడించారు. ప్రజలకు ఇప్పుడు ఏ అవసరం వచ్చినా 24 గంటలు వారికి అందుబాటులో ఉంటానని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాసేవకే తన జీవితం అంకితం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో
జనసేన నాయకులు రఘు, గాజుల శ్రీను, సాయి, సత్తిబాబు, జగదీష్, కనకరాజు, అశోక్, మంగ, కొండమ్మ, అమ్మలానరస, రాజేశ్వరి, పార్వతమ్మ, వర, శ్రీదేవి, కోదండమ్మా, జానకి, సునీత, దుర్గ, కుమారి, జనసేన యువనాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.