రామభద్రపురం మండలంలో జనసేన జోష్

బొబ్బిలి, జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలురు ఇచ్చిన ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గం, రాంభద్రపురం మండలం, జన్నివలస గ్రామంలో మండల నాయకులు కనకాల శ్యామ్, అల్లు రమేష్ ఆధ్వర్యంలో ఈసారి మనం వేసే ప్రతి ఒక్క అమూల్యమైన ఓటును జనసేనకు వేసి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలని జనసేన సిద్ధాంతాలను వివరించి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చెయ్యాలనే లక్ష్యంతో పని చేయాలని పెద్ద ఎత్తున జనసేన నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వల్లూరి జగదీష్, పొందూరు సత్యనారాయణ, జన్నివలస జనసైనికులు తదితరలు పాల్గొన్నారు.