రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా జనసేన – లక్షా ఇరవై వేల సాయం

ఎస్.కోట రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు జనసైనికులు అండగా నిలిచారు. మేమున్నామంటూ చేయూతనిచ్చారు. ఆర్థిక భరోసా కల్పించారు. ఎస్.కోట నియోజకవర్గం, దాసుళ్లపాలెం గ్రామానికి చెందిన కునిశెట్టి త్రినాథ్, ఎర్ర సాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిరుపేద కుటుంబాలు కావడంతో వారిపట్ల జనసైనికులు స్పందించారు. జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు కలిసి లక్షా ఇరవై వేల రూపాయలు ఆదివారం బాధిత కుటుంబాలకు అందించారు. పార్టీ నాయకులు వబ్బిన సత్యనారాయణ 20 వేలు, పెదిరెడ్ల రాజశేఖర్ 30 వేలు, గొరపల్లి రవికుమార్, గొరపల్లి చినబాబు 10 వేలు, సుంకరి అప్పారావు, జొన్నపల్లి సత్తిబాబు 5వేలు, ఎల్.కోట మండల జనసైనికులు 12 వేలు, వబ్బిన సన్యాసినాయుడు 3 వేలు, దాసుళ్లపాలెం జనసైనికులు 42 రూపాయలు కలిపి బాధిత కుటుంబానికి ఆ మొత్తాన్ని అందించారు. ముచకర్ల శ్రీను (రిలయన్స్) రెండు బియ్యం బస్తాలు అందించారు. కార్యక్రమంలో విరాళాలు అందించిన దాతలతో పాటూ, పార్టీ నాయకులు రామెళ్ల శివాజీ, రావాడ నాయుడు, వెంకట లక్ష్మీ, కోల మధు, మల్లువలస శ్రీను, నక్కరాజు సతీష్, గురజాడ వెంకటేష్, మళ్ల రాజు, పవన్, కిరణ్, మహేష్, రావు రమేష్, రామెళ్ల దుర్గా ప్రసాద్, ముచకర్ల శ్రీను, రామెళ్ల సింహాద్రి, గుమ్మడి వెంకటరావు, నక్క ప్రభాకర్, పెంటకోట శ్రీను, ఉగ్గిన చిన్నారావు, ఇరోతి రమణ, ముమ్మన రమణ, కోట్ని గోవింద్, జనసైనికులు పాల్గొన్నారు.