రైతుల పక్షాన పోరాటానికి దిగిన జనసేన నాయకులు అనుకుల రమేష్ అరెస్టు…!

గులాబ్ తుఫాను ప్రభావం వలన కురిసిన భారీ వర్షాల వలన తణుకు నియోజకవర్గం లోని వయ్యేరు కాలువ ఉదృతంగా ప్రవహించటం వలన నీట మునిగిన పంటపొలాలను పరిశీలించి రైతులకు వెన్నుదన్నుగా తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఉంటుందని తెలియపరచటం జరిగింది. జనసేన పార్టీ తరపున గెలిచిన తిరపతిపురం గ్రామ సర్పంచ్ శ్రీ కాండూరి లీల మణికంఠతో పాటుగా తిరపతిపురం, ఉరదాళ్ళపాలెం,బల్లిపాడు జనసేన నాయకులు కార్యకర్తలు రైతులతో ముంపు ప్రాంతాలలో పర్యటించి వారి తరుపున ప్రభుత్వం పై పోరాడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కలిగే వరకూ పోరాడతామని తెలియచేశారు.

అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామం లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన పొట్ట దశ ఉన్న పంట పొలాలు పూర్తిగా మునిగి పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయం కింద 25000/- రూ నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు తరుపున డిమాండ్ చేయటమైనది. అలాగే వయ్యేరు కాలువ తిరుపతిపురం ఆరుదలకోడు కొత్త గేట్లు కాలువ వైపుకు పెట్టాలని, పశువులకు పశుగ్రాసం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈరోజు తిరుపతిపురం గ్రామానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులుకు గ్రామ ప్రెసిడెంట్, రైతులు, రమేష్ మరియు జనసైనికులు అందరూ కలిసి వినతి పత్రం అందజేయడానికి వెళ్ళగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది .పోలీస్ శాఖ వారు జనసేన నాయకులు అనుకుల రమేష్ మరియు తిరుపతిపురం ప్రెసిడెంట్ ను అరెస్టు చేశారు.