జనసేన నేత సిజి రాజశేఖర్ ముందస్తు అరెస్ట్

పత్తికొండ: గురువారం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎమ్మిగనూరు పర్యటన సందర్భంగా పత్తికొండ జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ ను బుధవారం ముందస్తుగా పోలీస్ స్టేషన్కు తరలించారు. కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతామని తెలియజేయగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ముందస్తుగా సాయంకాలం ఐదు గంటలకు పత్తికొండ పోలీస్ స్టేషన్ కు, తరలించిన పత్తికొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు వారి బృందం, ఈ సందర్భంగా సిజి రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు ప్రోగ్రాం ఉంటే పత్తికొండలో ముందస్తు అరెస్ట్.. పోని నేను ఏమైనా ప్రధాన ప్రతిపక్షమా అని ప్రశ్నిస్తే సీమ ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అన్నావు, కర్నూలు కరువు జిల్లాగా ప్రకటించమని అడుగుతున్నావు, పత్తికొండ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి అంటున్నావు కాబట్టి ముందస్తు అరెస్టు అంటున్నారు పోలీస్ వారు. మరి సమస్యలు తీర్చేది, అడిగేది ఎవరు..?? మేము మాత్రమే కనపడుతున్నామా..?? ప్రాంత సమస్యలు పరిష్కారం అయ్యేది ఎన్నడూ..?? అని రాజశేఖర్ ప్రశ్నించారు.