ఎస్.కోట, ప్రస్తుత త్రైమాసికంలో ఉపాధిహామీ మట్టి పనులు తిమిడ్లో 25 మంది కూలీలకు మాత్రమే పని కల్పించారని, చెరువుల్లో నీరు తగ్గినందున గ్రామస్తు లందరికీ గురువారం నుండి పనులు ప్రారంభించాలని ఏ.పి.ఓ.రమ్య కి ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రతాప దేవి చెరువులో గురువారము ఉపాధి పనులు ప్రారంభించారు. ఈ మేరకు చెరువులోకి ఉపాధి కూలీలను తీసుకు వెళ్ళిన జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు గుణపముతో మట్టిని తవ్వి పనులు ప్రారంభించారు. గత 3 నెలలు పనులు లేక అల్లాడుతున్న ఉపాది కూలీలకు పనులు కల్పించిన ఘనత జనసేన పార్టీకే దక్కిందని కూలీలు ఆనందం వ్యక్తం చేస్తూ సన్యాసి నాయుడును వారు అభినందించారు.
Share this content:
Post Comment